Gold Rates: భగ్గుమంటున్న బంగారం..! 11 d ago

8K News-27/03/2025 బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. నిన్నటితో పోలిస్తే ఇవాళ (గురువారం) బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹400, ₹440 పెరిగింది. పండగల సీజన్ కావడంతో పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,350 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,840 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద స్థిరంగా ఉంది.